Chittoor: కాణిపాక బ్రహ్మోత్సవాల సమీక్ష.. భక్తులకు లోటుపాట్లు ఉండొద్దు!

Chittoor: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, కలెక్టర్, ఎస్పీ సమీక్షా సమావేశం.

VASU, PUTTALAPATTU
Published on: 22 Aug 2026 3:30 PM IST
Chittoor
X

Chittoor: కాణిపాక బ్రహ్మోత్సవాల సమీక్ష.. భక్తులకు లోటుపాట్లు ఉండొద్దు!

Chittoor: కాణిపాక బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం ఆలయ సమావేశ హాలు నందు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి , ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మణి నాయుడు, వివిధ శాఖల అధికారులు హాజరైనారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14 నుంచి నిర్వహించు కాణిపాక బ్రహ్మోత్సవాలను నిర్వహణలో భక్తుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి సూచించారు.

అనంతరం పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ కాణిపాక బ్రహ్మోత్సవాల నిర్వహణ విషయంలో ఎలాంటి లోటు పాట్లు ఉండకూడదని మొదటి అంశముగా చర్చించడం జరిగిందన్నారు. భక్తుడికి సంతృప్తికరమైన దర్శనం కల్పించి తీర్చ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలు అందించాలన్నారు. ఆలయానికి వచ్చిన వచ్చిన ప్రతిభక్తుడిని దర్శనానంతరం తిరిగి వెళ్ళేంతవరకు వారి రక్షణ బాధ్యత తీసుకోవాలని జిల్లా ఎస్పీకి తెలియజేశారు.

అలాగే కాణిపాకం ఆలయ పరిసర ప్రాంతాలలో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని పోలీస్ వ్యవస్థని కోరారు. విద్యుత్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉండాలని విద్యుత్ అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story