Kanipakam: కాణిపాకం బ్రహ్మోత్సవాలు మూషిక వాహనంపై వినాయక ఉత్సవం!

Kanipakam: కాణిపాకం బ్రహ్మోత్సవాలలో మూషిక వాహనంపై విహరించిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. భక్తులతో కిక్కిరిసిన పురవీధులు, విశేష పూజలు.

VASU, PUTTALAPATTU
Published on: 18 Sept 2026 10:17 AM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకం బ్రహ్మోత్సవాలు మూషిక వాహనంపై వినాయక ఉత్సవం!

Kanipakam: శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా గురువారం రాత్రి సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మూషిక వాహన పై కాణిపాకం పురవీధుల్లో వివరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ఉదయమే పంచామృత అభిషేకాలు చేసి తీసుకొచ్చి మూషిక వాహనం పైన ఆసీనులు చేసి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. కాణిపాక బ్రహ్మోత్సవాలలో స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రమైన వాహనం మూషిక వాహనం.

మేళ తాళాలతో కోలాటాలతో మూషిక వాహనంపై విహరిస్తున్న స్వామి వారిని దర్శించుకుంటే అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తారని వేద పండితులు తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి ముక్కు బడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆలయ అర్చకులు ఉదయదారులు భక్తులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU