Kanipakam: రాజరాజేశ్వరిగా కాణిపాకం మణికంఠేశ్వర అమ్మవారు

Kanipakam: కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థాన అనుబంధ శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాల 3వ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు.

VASU, PUTTALAPATTU
Published on: 13 Oct 2026 7:48 PM IST
Kanipakam
X

Kanipakam: రాజరాజేశ్వరిగా కాణిపాకం మణికంఠేశ్వర అమ్మవారు

Kanipakam: శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం నందు దసరా ఉత్సవాల సందర్భంగా ఈరోజు మూడవ రోజు సాయంత్రం అమ్మవారు రాజరాజేశ్వరి దేవిఅలంకారంలో దర్శనం ఇచ్చారు.

ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ,భక్తులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU