Kanipakam: కాణిపాకంలో గాయత్రీదేవిగా అమ్మవారి దర్శనం
Kanipakam: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ శ్రీ మణికంఠేశ్వరాలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.
Kanipakam: కాణిపాకంలో గాయత్రీదేవిగా అమ్మవారి దర్శనం
కాణిపాకం: శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం నందు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సాయంత్రం అమ్మవారు గాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన మరియు పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, మరియు వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.




