Kanipakam: కనులపండువగా వినాయక స్వామి రథోత్సవం

Kanipakam: కాణిపాకంలో వైభవంగా సాగిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి రథోత్సవం. రథంపై సిద్ధి, బుద్ధి సమేతుడై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు.

VASU, PUTTALAPATTU
Published on: 21 Sept 2026 4:15 PM IST
Kanipakam
X

Kanipakam: కనులపండువగా వినాయక స్వామి రథోత్సవం

కాణిపాకం: సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు వినాయక స్వామి సిద్ధిబుద్ధి సమేతుడై రథోత్సవములో ఊరేగుతున్న దృశ్యాలను చూసి ఆనందముతో పార్వతీ పరమేశ్వరులు మురిసిపోతారని పురాణాలలో తెలపబడిందని ఆలయ అర్చకులు తెలిపారు. 21 రోజు జరిగే కాణిపాక బ్రహ్మోత్సవాలలో అన్ని వాహన సేవలలో కన్నా రథోత్సవ వాహన సేవ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు అతి వైభవముగా నిర్వహిస్తారు.

స్వయంభుగా వెలిసిన స్వామివారు రథంపై అత్యంత వైభవముగా, సుందరముగా, సిద్ధి ,బుద్ధి, సమేతుడై భక్తులకు వరాలిచ్చేది ఒక్క కాణిపాక పుణ్యక్షేత్రం మాత్రంలోని జరుగుతుంది.

స్వామివారికి ప్రత్యేక అభిషేకములు కళ్యాణ మండపంలో నిర్వహించి పల్లకిలో మేళా తాళాలతో తీసుకువచ్చి రథముపై అధిరోహించి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు.స్వామి వారు విహరించు రథము రకరకాల సుగంధ పుష్పాలతో మామిడి తోరణాలతో అలంకరించిన దృశ్యం భక్తులకు కనుల పండుగగా నిలిచింది.

స్వామివారు కాణిపాక పురవీధు లలో విహరిస్తున్న దృశ్యం చూసి భక్తులు ఆనంద పరవశంతో స్వామివారి నామాలను తలుచుకుంటూ తమ యొక్క మొక్కుబడులను తీర్చుకున్నారు. స్వామివారి రథం పైన మురుమురులు అరటి పళ్ళు బెల్లం పదార్థాలు చల్లుతూ, నెయ్యి దీపాలు కొబ్బరికాయలతో స్వామివారికి భక్తులు పూజలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలని భక్తులు స్వామివారిని కోరుకునే దృశ్యం ఒక్క కాణిపాకం లో మాత్రమే జరుగుతుంది.

సంతానము లేని వారు స్వామివారి రథము కింద అటు ఇటు తిరుగుతూ భక్తులు మొక్కుబడులు తీర్చుకుంటారు. రథోత్సవం తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉంటారు.

రథోత్సవం రోజున భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు స్వామివారి దర్శనాలు అన్న ప్రసాదాలు త్రాగునీరు మొదలగు సౌకర్యాలు కల్పించారు. రథోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆనందంగా తిలకించారు.

ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ , ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మనీ నాయుడు, ఆలయ అర్చకులు, సిబ్బంది, జిల్లా పోలీస్ యంత్రాంగం, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU