Chittoor: కాణిపాకంలో వైభవంగా హంస వాహనంపై స్వామివారి ఊరేగింపు!

Chittoor: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస వాహన సేవ. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన భక్తులు.

VASU, PUTTALAPATTU
Published on: 16 Sept 2026 6:52 AM IST
Chittoor
X

Chittoor: కాణిపాకంలో వైభవంగా హంస వాహనంపై స్వామివారి ఊరేగింపు!

Chittoor: శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం హంస వాహనంపై మాడ వీధుల గుండా సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి మాడవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.ముందుగా స్వామివారికి కళ్యాణ మండపము నందు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అనంతరం పల్లకిలో స్వామి వారిని తీసుకువచ్చి హంస వాహనంపై ఆశీనులను చేసి స్వామివారికి పూజలు నిర్వహించారు.

అనంతరం పురవీధుల గుండా స్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. హంస వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయని ప్రతీక తీవ్ర వర్షం లో కూడా స్వామివారిని దర్శించుకొనుటకు భక్తులు నిరీక్షణ చేశారు.

సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించే భక్తులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తి భావముతో తమ ప్రదర్శనలు ఇచ్చారు. బ్రహ్మోత్సవాలు మొదలైన రోజు వర్షం రావడంతో భక్తులు ఆనందపడ్డారు. హంస వాహన కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్ మనీ నాయుడు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU