Kanipakam: కాణిపాకంలో సంకటహర చతుర్థి యాగంలో ఎమ్మెల్యే మురళీ మోహన్
Kanipakam: పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీ మోహన్ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి మహాయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
Kanipakam: కాణిపాకంలో సంకటహర చతుర్థి యాగంలో ఎమ్మెల్యే మురళీ మోహన్
కాణిపాకం: పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో జరిగిన సంకటహర చతుర్థి యాగంలో పాల్గొన్నారు.
కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన సంకటహర చతుర్థి మహాయాగంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆ విఘ్నేశ్వరుని వేడుకున్నట్లు ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.




