Kanipakam: బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రక్షాబంధన కార్యక్రమం

Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా యాగశాలలో వైభవంగా రక్షాబంధన కార్యక్రమం నిర్వహించిన ఆలయ అధికారులు.

VASU, PUTTALAPATTU
Published on: 15 Sept 2026 9:42 PM IST
Kanipakam
X

Kanipakam: బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రక్షాబంధన కార్యక్రమం

కాణిపాకం: శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పవిత్ర హృదయముతో బ్రహ్మోత్సవాలను నిర్వహించే విధముగ స్వామివారికి పూజలు నిర్వహించి రక్షాబంధన కార్యక్రమం ఆలయ అధికారులు చేపట్టారు.

ఆగమ శాస్త్ర ప్రకారం అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారి బ్రహ్మోత్సవాలను నియమ నిబంధనలతో నిర్వహించుటకు యాగశాల నందు ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర గురుకుల్ ,ఆలయ ఈవో పెంచల్ కిషోర్ కి ఆలయ అర్చకులు రక్షాబంధన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మనీ నాయుడు,ఆలయ అర్చకులు ,వేద పండితులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU