Kanipakam: కాణిపాకంలో వైభవంగా సంకటహర చతుర్థి వ్రతాలు

Kanipakam: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఆస్థాన మండపంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఉదయం, సాయంత్రం 4 బ్యాచుల్లో వైభవంగా నిర్వహించారు.

VASU, PUTTALAPATTU
Published on: 29 Sept 2026 7:31 PM IST
Kanipakam
X

Kanipakam: కాణిపాకంలో వైభవంగా సంకటహర చతుర్థి వ్రతాలు

Chittoor: శ్రీ స్వామివారి దేవస్థానం ఆస్థాన మండపం నందు ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా వైభవంగా శ్రీ స్వామివారి సంకటహర గణపతి వ్రతం ఉదయం మరియు సాయంత్రం 4 బ్యాచుల్లో ఈ వ్రతంని నిర్వహించడం జరిగింది.

స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న సంకటహర వ్రతం మహత్యం గురించి తెలుసుకున్న భక్తులు ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో ఈ పూజలో పాల్గొని స్వామి వారిని భక్తితో పూజించి తమ కోరికలు నెరవేర్చాలని స్వామివారిని వేడుకొంటారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, సూపర్డెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి, అర్చకులు, వేదపండితులు, తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU