Kanipakam: వైభవంగా చిన్న శేష వాహనంపై వినాయక స్వామి ఊరేగింపు
Kanipakam: కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా 1,116 క్షీర కలశాలతో ప్రత్యేక అభిషేకాలు. చిన్న శేష వాహనంపై విహరించిన వినాయక స్వామి.
Kanipakam: వైభవంగా చిన్న శేష వాహనంపై వినాయక స్వామి ఊరేగింపు
కాణిపాకం: కాణిపాక వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం బంగారు చిన్న శేష వాహనంపై సిద్ధి బుద్ధి సమేతుడై స్వామివారు ఆలయ మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
అంగరంగ వైభవముగా చిన్న శేష వాహనంపై వివరిస్తున్న స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయని, అలాగే రాహు కేతు దోషాలు, గృహ రుణ, ఉద్యోగం వివాహం కాని వారికి కలుగుతుందని పురాణాలలో చెప్పబడిందని ఆలయ అర్చకులు తెలిపారు.
శేష వాహనం ఊరేగుతున్న ప్రదేశాలలో అరటి చెట్లు మామిడి తోరణాలు అలంకరణ ఒక ప్రత్యేకత సంతరించుకుంది .శేష వాహన సేవకు కమ్మ వంశస్థులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు.
సాయంత్రం పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ చైర్మన్ మనీ నాయుడు, అర్చకులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




