Kanipakam: కాణిపాకంలో వైభవంగా శ్రీ వరదరాజ స్వామి వారి గరుడ సేవ!
Kanipakam: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గరుడ సేవను ఆలయ అధికారులు వైభవంగా నిర్వహించారు.
Kanipakam: కాణిపాకంలో వైభవంగా శ్రీ వరదరాజ స్వామి వారి గరుడ సేవ!
కాణిపాకం: శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం నందు పౌర్ణమి సందర్భంగా రాత్రి స్వామివారికి గరుడ సేవ ఆలయ అధికారులు నిర్వహించారు.
ఆలయ మాడవీధుల గుండా స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు .ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Next Story




