Kanipakam: కాణిపాకంలో వైభవంగా సంకటహర చతుర్థి వ్రతం!
Kanipakam: కాణిపాకం ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం బంగారు రథంపై స్వామివారి గ్రామోత్సవాన్ని కన్నులపండువగా చేపట్టారు.
Kanipakam: కాణిపాకంలో వైభవంగా సంకటహర చతుర్థి వ్రతం!
చిత్తూరు జిల్లా:
పూతలపట్టు నియోజకవర్గ:
కాణిపాకం: కాణిపాకం ఆస్థాన మండపంలో సంకటహర చతుర్థి వ్రతంలో పాల్గొన్న భక్తులు. ఆలయ అర్చకులు సిద్ధి, బుద్ధి సమేత మైన వినాయక స్వామికి పూజలు నిర్వహించి సంకట చతుర్థి వ్రతం ఆచరించటం వలన కుటుంబానికి సకల సంతోషాలని కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. సంకటహర వ్రతం ఆచరించడం వలన అన్ని కష్టాలు తొలగిపోయి మంచి ఫలితాన్ని ఇస్తుందని పూర్వము సాక్షాత్తు పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు అర్చకులు తెలిపారు. సంకటహర చతుర్థి వ్రతం రోజున సాయంత్రం బంగారు రథం పైన స్వామివారు మాడవీధుల గుండా విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ సూపర్డెంట్ కోదండపాణి, అర్చకులు బాలు స్వామి, వేద పండితులు, సుబ్బారావు స్వామి, కాశ్యప స్వామి భక్తులు పాల్గొన్నారు.
రిపోర్టర్: వాసుదేవా చారి.




