Kanipakam: కాణిపాకం స్వామివారికి ద్వారకా తిరుమల పట్టువస్త్రాలు!
Kanipakam: కాణిపాకం వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు: ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ. తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ పాలకవర్గం.
Kanipakam: కాణిపాకం స్వామివారికి ద్వారకా తిరుమల పట్టువస్త్రాలు!
కాణిపాకం: శ్రీ స్వామి వారి దేవస్థానం 2026 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారక తిరుమల (చిన్న తిరుపతి) ఏలూరు జిల్లా నుండి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించినద్వారక తిరుమల దేవస్థానం డిప్యూటీ ఈ.వో శ్రీ భద్రాజి గారు, ఆలయ ప్రధాన అర్చకులు అధికారులు, సమర్పించడం జరిగింది.
వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం .చైర్మన్ మణి నాయుడు గారు,ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు, ఈ కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు,నాగరాజు నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శివప్రసాద్, కృష్ణవేణి, శ్రీవాణి, అనసూయ, వసంత, అర్చకులు, వేద పండితులు, కాణిపాకం దేవస్థానం ఏఈఓ రవీంద్రబాబు, ధనపాల్, ధనంజయ, సూపర్డెంట్లు వాసు, కోదండపాణి, ద్వారక తిరుమల దేవస్థానం సూపర్డెంట్ హైగ్రీవాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.




