Kanipakam: కామధేను వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన వినాయక స్వామి

Kanipakam: కాణిపాకం వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కామధేను వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఘనంగా జరిగింది.

VASU, PUTTALAPATTU
Published on: 2 Oct 2026 11:46 PM IST
Kanipakam
X

Kanipakam: కామధేను వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన వినాయక స్వామి

కాణిపాకం: శ్రీ స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి కామధేనువాహనం సేవ పై దర్శనం ఇచ్చిన దేవాది దేవుడు పార్వతీ తనయుడు విఘ్నేశ్వరుడు. స్వామి అమ్మవార్లను కళ్యాణ మండపం నందు విశేష పూజలు నిర్వహించారు.

స్వామి అమ్మవార్లను పల్లకిలో తీసుకువచ్చి కామదేను వాహనంపై ఆశీస్సులు చేసి అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు హారతులు ఇచ్చారు.

కామదేను వాహనం అంటే సాక్షాత్తు గోవు పై సిద్ధి బుద్ధి సమేతుడైన స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. కామదేను వాహనంపై కాణిపాకం పురవీధులలో వివరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు . స్వామివారిని భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, మరియు ఈ.ఓ, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఉభయదారులు, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU