Chittoor: 189 కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కార్మేగన్ నామినేషన్!

Chittoor: చిత్తూరు జిల్లా గుడిపాల మండలం 189 కొత్తపల్లి సర్పంచ్ అభ్యర్థిగా కార్మేగన్ నామినేషన్ వేశారు. గ్రామంలో మిగిలిన సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Chandra Sekhar, Chittoor
Published on: 22 Nov 2026 8:44 PM IST
Chittoor
X

Chittoor: 189 కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కార్మేగన్ నామినేషన్!

చిత్తూరు: చిత్తూరు జిల్లా గుడిపాల మండలం 189 కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కార్మేగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను సర్పంచ్‌గా పనిచేశానని, తన సోదరి రెండుసార్లు ఎంపీటీసీగా, తన తండ్రి వరుసగా ఐదుసార్లు సర్పంచ్‌గా ఎన్నికై గ్రామ అభివృద్ధికి విశేష సేవలు అందించారని తెలిపారు.

తమ కుటుంబం కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలలో కొనసాగుతూ ప్రజా సేవకు ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు అవసరమైన పలు మౌలిక సదుపాయాలను కల్పించామని, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు ఉన్నాయని తెలిపారు.

తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామంలో మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కార్మేగన్ హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు.. మద్దతుదారులు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor