Chittoor: బాలికల రక్షణే ధ్యేయంగా అవగాహన సదస్సు

Chittoor: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం పద్మ సరస్సు గ్రామంలో కిషోరి వికాసం అవగాహన సదస్సు నిర్వహించారు.

VIJAY, G.D.NELLORE
Published on: 5 May 2026 5:33 PM IST
Chittoor
X

Chittoor: బాలికల రక్షణే ధ్యేయంగా అవగాహన సదస్సు

Chittoor: చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, పద్మ సరస్సు గ్రామం లోని మోడల్ ఫౌండేషన్ స్కూల్ అంగన్వాడీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మండల అధికారుల సూచనలతో సూపర్వైజర్ రోజా రమణి ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని మూడు సచివాలయలకు సంబంధించిన అంగన్వాడి కార్యకర్తలు మరియు వాళ్ళ అంగన్వాడి కేంద్రం పరిధిలోని కిషోరి బాలికలతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో

01-05-2026 నుండి 09-06-2026 కిషోర్ వికాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈ సమావేశాలలో విద్య, వైద్యం, సామాజిక సమస్యలు, చట్టాలు, పోస్ట్ కి ఆహారం, పరిశుభ్రత రుతుక్రమ పరిశుభ్రత, బాల్య వివాహాలు, పునరుత్పత్తి ఆరోగ్య ప్రభావాలు ఆరోగ్య ప్రభావాలు, పిల్లల హక్కులు, పేరెంట్స్ పిల్లలు లైంగిక నుంచి వేధింపులు నుంచి రక్షణ ఫోక్సో కేసు అవగాహనను కల్పించడు జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో

సి ఆర్ పి గణేష్, ఎం పి హెచ్ (ఎఫ్) శిరీష,DCPU కౌన్సిలర్ ఉష, DCPU ఉష, VOA సుబ్బమ్మ, ఆశ వర్కర్ కుమారి, అంగన్వాడి కార్యకర్తలు, కిషోర్ బాలికలు పాల్గొన్నారు.

VIJAY, G.D.NELLORE

VIJAY, G.D.NELLORE

Next Story