Madanapalle: కృష్ణా నీళ్లకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే షాజహాన్!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెకు కృష్ణా జలాల రాక.. ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, టీడీపీ నాయకులు.
Madanapalle: కృష్ణా నీళ్లకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే షాజహాన్!
Madanapalle: కృష్ణా జలాలు మదనపల్లె ప్రాంతాన్ని తాకిన సందర్భంగా ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా కృష్ణా జలాలకు హారతి ఇచ్చి, టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జలాలు మదనపల్లెకు చేరుకోవడం పట్ల ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కోళ్లబైలు ఇన్‌చార్జిలు 1, 2, రాటకొండ శ్రీనివాసులు నాయుడు, 43వ వార్డు ఇన్‌చార్జి బాలమాలి శేఖర్, 48వ వార్డు ఇన్‌చార్జి స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ.. కృష్ణా జలాలు మదనపల్లె ప్రాంతానికి చేరడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు.
కృష్ణా జలాలతో ఈ ప్రాంతంలో నీటి సమస్యలు తగ్గడంతో పాటు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరుతున్న ఈ తరుణం మదనపల్లె చరిత్రలో ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుందన్నారు. కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకుని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
వార్డు ఇన్‌చార్జిలు మాట్లాడుతూ.. కృష్ణా జలాల రాకతో మదనపల్లె ప్రజల కల సాకారమవుతోందన్నారు. జలాలకు హారతి ఇచ్చి, టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కృష్ణా జలాలతో రైతులు, ప్రజలకు మేలు చేకూరి మదనపల్లె ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.




