Kanipakam: కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ వేడుకలు!
Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవను పురస్కరించుకుని 350 కలశాలతో క్షీరాభిషేకం నిర్వహించారు.
Kanipakam: కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ వేడుకలు!
Kanipakam: కల్పవృక్ష వాహన సేవ సందర్భంగా 350 కలశాలతో స్వామి అమ్మవార్లకు క్షరాభిషేకం నిర్వహించిన ఆలయ అర్చకులు.
శ్రీ స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్షం వాహనం సందర్భంగా, ఆలయంలో ధ్వజస్తంభానికి విశేష పూల అలంకరణలు, మరియు ఆలయం లోపల ప్రత్యేక పూలతో సుందరీకరణం చేయడం జరిగింది. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి, మరియు దేవస్థానం సిబ్బంది, అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో కల్పవృక్ష వాహన సేవ రాత్రికి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఉదయం సుమారు 350 కలిశాలతో కాణిపాకం పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి ఆలయంలోని కళ్యాణ వేదిక దగ్గర ఉత్సవమూర్తులకు వైభవంగా ప్రత్యేక అభిషేకం ఆలయ అర్చకులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ శ్రీ మణి నాయుడు, ఈ.వో శ్రీ పెంచల కిషోర్, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, శివప్రసాద్, సతీష్, సుబ్బారెడ్డి, కృష్ణవేణి, అనసూయ, వసంత, ఏఈవోలు, సూపర్డెంట్లు, అధికారులు, అర్చకులు,వేద పండితులు,తదితరులు పాల్గొన్నారు.




