Kuppam: కుప్పంలో తీరని విషాదం.. విద్యుత్ స్తంభం ఎర్త్ వైర్ తగిలి ఆరేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి!
Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం మండలం అగ్రహారం గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటూ విద్యుత్ స్తంభం ఎర్త్ వైర్‌ను తాకడంతో ఆరేళ్ల చిన్నారి నేత్ర శ్రీ విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది.
Kuppam: కుప్పంలో తీరని విషాదం.. విద్యుత్ స్తంభం ఎర్త్ వైర్ తగిలి ఆరేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి!
కుప్పం (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని మంకల దొడ్డి పంచాయతీ అగ్రహారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ధర్మదురై కుమార్తె నేత్ర శ్రీ (6) ఇంటిముందు ఆడుకుంటూ విద్యుత్ స్తంభం ఎర్త్ వైర్ ను తాకడంతో విద్యుత్ షాక్ కు గురై చిన్నారి మృతి చెందింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నేల తడిగా ఉండడంతో పాటు విద్యుత్ స్తంభం లోని ఎర్త్ వైర్ కు విద్యుత్ సరఫరా కావడంతో దాన్ని తాకిన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.
Next Story




