Kurabalakota: కురబలకోటలో ఘనంగా శ్రీ కనకదుర్గమ్మ జాతర
Kurabalakota: తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోటలో ఘనంగా కనకదుర్గమ్మ జాతర. అమ్మవారిని దర్శించుకున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు.
Kurabalakota: కురబలకోటలో ఘనంగా శ్రీ కనకదుర్గమ్మ జాతర
తంబళ్లపల్లి: తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలంలో బీజేపీ నాయకులు భువనేశ్వరి సత్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన శ్రీ కనకదుర్గమ్మ జాతరలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీరామ్ చినబాబు, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
అనంతరం జాతరకు విచ్చేసిన భక్తులను పలకరించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నారదరెడ్డి, టీడీపీ నాయకులు గుండ్లపల్లి ప్రభాకర్, మంజు, బీజేపీ యువ నాయకులు సింహం శ్రీకాంత్ తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




