Rapurivaripalle: పీటీఎం మండలంలో 'సార్' సేవలపై అవగాహన సదస్సు

Rapurivaripalle: అన్నమయ్య జిల్లా పీటీఎం మండలం రాపూరివారిపల్లెలో ప్రభుత్వ 'SIR' సేవల వినియోగంపై కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది.

Srinivasulu, Madanapalle
Published on: 19 Jun 2026 4:14 PM IST
Rapurivaripalle
X

Rapurivaripalle: పీటీఎం మండలంలో 'సార్' సేవలపై అవగాహన సదస్సు

రాపూరివారిపల్లె: పీటీఎం మండలం రాపూరివారిపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది కలిసి ప్రజలకు SIR సేవల వినియోగంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సారే ద్వారా అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవలు, వాటి ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సమీర మాట్లాడుతూ SIR సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

టీడీపీ కన్వీనర్ రాపూరి రాజశేఖర్ రెడ్డి, జనసేన పార్టీ వీర మహిళ ప్రత్యూష ధర్మ గల్లా మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందించేందుకు SIR ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గ్రామ ప్రజలు ఈ సేవలను వినియోగించుకొని ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందాలని కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story