Madanapalle: రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కబ్జా నాపై హత్యాయత్నం చేశారు

Madanapalle: రియల్టర్ల అరాచకం పిత్రార్జిత భూమిని కబ్జా చేశారని, సర్వే అధికారులనే బెదిరించారంటూ అన్నమయ్య జిల్లా ఎస్పీకి బాధితురాలు రెడ్డెమ్మ ఫిర్యాదు.

Srinivasulu, Madanapalle
Published on: 26 May 2026 3:18 PM IST
Madanapalle
X

Madanapalle: రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కబ్జా నాపై హత్యాయత్నం చేశారు

మదనపల్లె: పిత్రార్జిత భూమిని రియల్టర్లు కబ్జా చేశారని, తమకు ప్రాణహాని ఉందంటూ కురబలకోట మండలం ఎర్రజేనువారిపల్లికి చెందిన బాధితురాలు రెడ్డెమ్మ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై భూమిని ఆక్రమించారని ఆరోపించిన ఆమె, సర్వేకు వచ్చిన అధికారులను సైతం బెదిరించి వెనక్కి పంపించారని పేర్కొన్నారు.

ఇటీవల తనపై హత్యాయత్నం జరిగిందని, రియల్టర్ల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ తనకు, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఎస్పీని వేడుకుంది. ఈ ఘటనపై అధికారులు స్పందించి విచారణ చేపట్టాల్సి ఉంది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story