Kurabalakota: కురబలకోట మండలంలో భూ రీ-సర్వే రగడ

Kurabalakota: అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ఎర్రజనువారిపల్లిలో భూ రీ-సర్వే తీవ్ర వివాదాస్పదంగా మారింది.

Srinivasulu, Madanapalle
Published on: 22 May 2026 1:18 PM IST
Kurabalakota
X

Kurabalakota: కురబలకోట మండలంలో భూ రీ-సర్వే రగడ

కురబలకోట మండలం: ఎర్రజనువారిపల్లిలో కొంతమంది రైతులకు సంబంధించిన సర్వే నెంబర్ 605లో 35 ఎకరాల భూమికి రీ-సర్వే జరుగుతున్న సందర్భంగా వివాదం నెలకొంది. భూమి సర్వేకు సంబంధించి పి.జి.ఆర్.ఎస్‌లో ఫిర్యాదు పూర్తి చేసినప్పటికీ అధికారులు సరైన విధంగా కొలతలు చేపట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో సర్వే ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్త సేకరణ కోసం సంఘటన స్థలానికి వెళ్లిన రిపోర్టర్లపై విలేజ్ సర్వేయర్ సతీష్ అత్యుత్సాహం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్కడ పరిస్థితులను చిత్రీకరిస్తూ రిపోర్టర్ సెల్ఫీ/ఫోటోలు తీసుకుంటుండగా “మీరెవరు?” అంటూ ప్రశ్నిస్తూ అభ్యంతరకరంగా ప్రవర్తించారని రిపోర్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సమాచార సేకరణ చేస్తున్న మీడియా ప్రతినిధుల విధులకు ఆటంకం కలిగించడం తగదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భూమి సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story