Chittoor: రాజకీయాల్లో రౌడీయిజం, బెదిరింపులను సహించేది లేదని నేతల హెచ్చరిక!

Chittoor: కులాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలు మానుకోవాలని, రౌడీయిజం, బెదిరింపులను సహించేది లేదని చిత్తూరులో వన్నెకుల క్షత్రియ నేతలు వైఎస్సార్‌సీపీ నాయకులను హెచ్చరించారు.

Chandra Sekhar, Chittoor
Published on: 27 Nov 2026 5:46 PM IST
Chittoor
X

Chittoor: రాజకీయాల్లో రౌడీయిజం, బెదిరింపులను సహించేది లేదని నేతల హెచ్చరిక!

Chittoor: వన్నెకుల క్షత్రియుల మధ్య విభేదాలు సృష్టిస్తూ, కులాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలకు వైఎస్సార్‌సీపీ నాయకులు స్వస్తి పలకాలని వన్నెకుల క్షత్రియ నేతలు హెచ్చరించారు.రాజకీయాల్లో రౌడీయిజం, బెదిరింపులకు తావులేదని స్పష్టం చేశారు.ఈనెల 26న చిత్తూరు ఆర్డీవో కార్యాలయం వద్ద నామినేషన్ అప్పీళ్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై శుక్రవారం ఎమ్మెల్యే ప్రజాదర్బార్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది త్రిమూర్తి మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి ఎంసీ విజయానందరెడ్డి అసత్య ప్రచారాలతో కులాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి పచ్చయ్యప్పన్ మాట్లాడుతూ, ఆర్డీవో కార్యాలయం వద్ద తమ పార్టీ కార్యకర్తపై విజయానందరెడ్డి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని సూచించారని తెలిపారు. ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

వన్నెకుల క్షత్రియులంతా ఐక్యంగా ఉంటారని, బెదిరింపులు, రౌడీయిజం రాజకీయాలను సహించబోమని నాయకులు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, నగర అధ్యక్షుడు ఉదయ్ కుమార్, కుల సంఘం అధ్యక్షుడు విజయకుమార్, మాజీ డిప్యూటీ మేయర్ సుబ్రీ, కార్పొరేటర్లు శంకర్, గణేష్ మేస్త్రి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor