Madanapalle: ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీలో లైఫ్ కేర్ దొర రాజశేఖర్‌కు చోటు
Madanapalle: స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీలో స్థానం పొందిన లైఫ్ కేర్ దొర రాజశేఖర్ మదనపల్లె జనసేన ముఖ్య నాయకులను కలిసి సత్కరించారు.
Madanapalle: ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీలో లైఫ్ కేర్ దొర రాజశేఖర్‌కు చోటు
మదనపల్లె: స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీలో స్థానం దక్కించుకున్న లైఫ్ కేర్ దొర రాజశేఖర్ మదనపల్లె నియోజకవర్గ జనసేన నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాయలసీమ రీజినల్ కో-ఆర్డినేటర్ గంగారపు రాందాస్ చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం, ఏపీఐఐసీ చైర్మన్ మైఫోర్స్ మహేష్, సేవాదళ్ సభ్యుడు సిరివెలు చరణ్‌లను కలిసి శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా దొర రాజశేఖర్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీలో అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంగా ముందుకు సాగుతానని తెలిపారు.




