Madanapalle: మదనపల్లె 35వ వార్డులో ఘనంగా పింఛన్ల పంపిణీ!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆదేశాలతో 35వ వార్డులో రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్ల పంపిణీ.
Madanapalle: మదనపల్లె 35వ వార్డులో ఘనంగా పింఛన్ల పంపిణీ!
Madanapalle: మదనపల్లె శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ భాషా ఆదేశాల మేరకు 35వ వార్డులో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 35 వార్డు ఇంచార్జ్ తెలుగుదేశం పార్టీ నాయకులు స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
రాష్ట్రంలో ప్రతినెల నిర్వహించే పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రజలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని నాయకులు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




