Madanapalle: ఆధ్య హాస్పిటల్‌లో అందుబాటులోకి ఆధునిక ESWL చికిత్సా విధానం!
Madanapalle: మదనపల్లెలోని ఆధ్య హాస్పిటల్‌లో శస్త్రచికిత్స లేకుండా కిడ్నీ రాళ్లను తొలగించే ఆధునిక ESWL (షాక్ వేవ్ లిథోట్రిప్సీ) చికిత్స అందుబాటులోకి వచ్చింది.
Madanapalle: ఆధ్య హాస్పిటల్‌లో అందుబాటులోకి ఆధునిక ESWL చికిత్సా విధానం!
Madanapalle: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారికి మదనపల్లెలోని ఆధ్యా హాస్పిటల్‌లో ESWL (షాక్ వేవ్ లిథోట్రిప్సీ) చికిత్స అందుబాటులోకి వచ్చినట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆధ్యా హాస్పిటల్ డాక్టర్ సనత్ రెడ్డి మాట్లాడుతూ శస్త్రచికిత్స లేకుండా షాక్ వేవ్స్ ద్వారా కిడ్నీ రాళ్లను విచ్ఛిన్నం చేసే ESWL విధానాన్ని తమ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఈ విధానం ద్వారా రోగులకు సురక్షితమైన చికిత్స అందించడంతో పాటు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కిడ్నీ రాళ్లకు ESWL, RIRS, URSL, Mini PCNL, ల్యాపరోస్కోపిక్ స్టోన్ సర్జరీ వంటి వివిధ ఆధునిక చికిత్సా విధానాలు ఒకే చోట అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
నిపుణులైన యూరాలజీ వైద్య బృందం ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ సనత్ రెడ్డి వెల్లడించారు.




