Madanapalle: కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముమ్మర ప్రచారం!
Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో 2వ వార్డు అభ్యర్థి మల్లేశ్వరి, 3వ వార్డు అభ్యర్థి కవిత విజయం కోరుతూ కూటమి నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు.
Madanapalle: కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముమ్మర ప్రచారం!
Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. రెండో వార్డు నుంచి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ డాన్స్ రెడ్డప్ప భార్య మల్లేశ్వరి, మూడో వార్డు నుంచి టీడీపీ నాయకుడు రఘుపతి నాయుడు భార్య కవిత కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వారి విజయానికి మద్దతుగా యూనిట్ ఇన్చార్జి జయచంద్ర, జై భీమ్ నాయకులు కోన భాస్కర్, రామసుబ్బయ్య, సమర, మల్లికార్జున, బొరుగుల రమణ, ఆదెప్ప ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లోకి వెళ్లి కూటమి అభ్యర్థులకు మద్దతు కూడగడుతూ, భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రెండో, మూడో వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.




