Madanapalle: మదనపల్లె: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కీలక భేటీ!
Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల వేళ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ కుమార్ నివాసంలో మంత్రి మండిపల్లి ఆత్మీయ సమావేశం నిర్వహించి వ్యూహాలపై చర్చించారు.
Madanapalle: మదనపల్లె: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కీలక భేటీ!
Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (చినబాబు) నివాసంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆత్మీయంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మదనపల్లె మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పరిణామాలు, ఎన్నికల కార్యాచరణ, కూటమి విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ,మదనపల్లె అభివృద్ధి మరియు ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని నాయకులు అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఈ సమావేశంలో చర్చించారు.




