Madanapalle: మదనపల్లె 32వ వార్డు బీఎస్పీ అభ్యర్థిగా అరుణ్ కుమార్

Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఎస్పీ తరఫున ఏనుగు గుర్తుపై పోటీ చేస్తూ అరుణ్ కుమార్ గూడుపల్లి శనివారం నామినేషన్ దాఖలు చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 17 Oct 2026 6:30 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె 32వ వార్డు బీఎస్పీ అభ్యర్థిగా అరుణ్ కుమార్

మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తరఫున అరుణ్ కుమార్ గూడుపల్లి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఏనుగు గుర్తుపై పోటీ చేస్తున్న ఆయన ఈ సందర్భంగా తనకు మద్దతు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా అరుణ్ కుమార్ గూడుపల్లి మాట్లాడుతూ.. బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి 32వ వార్డులో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి తన విజయానికి సహకరించాలని కోరారు. 32వ వార్డు ప్రజలు తనను ఆదరించి, బీఎస్పీ ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీర్వాదంతో కౌన్సిలర్‌గా ఎన్నికైతే వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అరుణ్ కుమార్ గూడుపల్లి పేర్కొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle