Madanapalle: వినాయక నిమజ్జనంపై అవగాహన సదస్సు - డీఎస్పీ బుచ్చిరాజు

Madanapalle: మదనపల్లెలో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Srinivasulu, Madanapalle
Published on: 9 Sept 2026 11:37 PM IST
Madanapalle
X

Madanapalle: వినాయక నిమజ్జనంపై అవగాహన సదస్సు - డీఎస్పీ బుచ్చిరాజు

మదనపల్లె: మదనపల్లెలో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు పాల్గొని నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలు, భద్రతా చర్యలపై నిర్వాహకులు, భక్తులకు అవగాహన కల్పించారు.

వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ సహకరించాలని డీఎస్పీ బుచ్చిరాజు సూచించారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు, నిర్వాహకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story