Madanapalle: మదనపల్లి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బుచ్చిరాజు
Madanapalle: మదనపల్లి సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఎం.బుచ్చిరాజు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని కలిసి పుష్పగుచ్ఛం అందజేత.
Madanapalle: మదనపల్లి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బుచ్చిరాజు
మదనపల్లె: మదనపల్లి..మదనపల్లి సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా ఎం.బుచ్చిరాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. వెయిటింగ్ లో ఉన్న ఆయనను ప్రభుత్వం ఇక్కడకు నియమించింది.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
నూతన డీఎస్పీకి ఎస్పీ శుభాకాంక్షలు తెలుపుతూ.. విధి నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యలకు తక్షణమే స్పందించాలని ఆదేశించారు.
ప్రధానంగా మహిళల భద్రత, సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించి పారదర్శకంగా పని చేయాలని సూచించారు.
Next Story




