Madanapalle: మదనపల్లె శివాలయంపై వివాదాస్పద పోస్టు, కేసు నమోదు
Madanapalle: మదనపల్లె మడికయ్యల శివాలయంపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు చేసిన ఫోటోగ్రాఫర్ మనోజ్ పై కేసు నమోదు. దర్యాప్తు చేపట్టిన రూరల్ పోలీసులు.
Madanapalle: మదనపల్లె శివాలయంపై వివాదాస్పద పోస్టు, కేసు నమోదు
మదనపల్లె: పట్టణంలోని మడికయ్యల శివాలయానికి సంబంధించిన అంశంపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు చేసిన యూట్యూబ్, స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ మనోజ్ పై మదనపల్లె రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల శివాలయానికి వచ్చిన అమ్మాయిలు చీర కట్టుకుని రాలేదంటూ మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ పోస్టు వివాదానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story




