Madanapalle: దేవా రమేష్ ఆహ్వానం మేరకు ప్రార్థనల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ కుమార్!
Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ కుమార్ (చినబాబు) చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. క్రైస్తవ మత పెద్దల ఆశీస్సులు, ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ.
Madanapalle: దేవా రమేష్ ఆహ్వానం మేరకు ప్రార్థనల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ కుమార్!
Madanapalle: మదనపల్లె టీడీపీ రాజంపేట పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు దేవా రమేష్ ఆహ్వానం మేరకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు, మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీరామ్ కుమార్ (చినబాబు) సి.ఎస్.ఐ, జె.సి.ఎం. చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు ఆయనకు ఆశీస్సులు అందజేశారు.
ఈ సందర్భంగా దేవా రమేష్ మాట్లాడుతూ... మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీరామ్ కుమార్ (చినబాబు) ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, మదనపల్లె పట్టణ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని, మదనపల్లె పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ... తనను ఒక అన్నగా, తమ్ముడిగా, అమ్మలా ఆదరించి, ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంగా తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికైనా ఏ కష్టం వచ్చినా ముందుండి తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే చర్చికి తన వంతు సహాయంగా ఏ విధమైన అవసరం ఉన్నా తప్పకుండా సహకరిస్తానని, క్రైస్తవ సోదరుల అభివృద్ధి, సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని చినబాబు స్పష్టం చేశారు.




