Madanapalle: కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ బర్త్‌డే వేడుకలు ఘనం!
Madanapalle: మదనపల్లె కాంగ్రెస్ కార్యాలయంలో ఎస్. రెడ్డి సాహెబ్ పుట్టినరోజు వేడుకలు. 2029లో రాహుల్ గాంధీని పీఎం చేయడమే లక్ష్యమన్న రెడ్డి సాహెబ్.
Madanapalle: కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ బర్త్‌డే వేడుకలు ఘనం!
Madanapalle: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడు ఎస్. రెడ్డి సాహెబ్ అని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. పట్టణంలోని దొంతి వీధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎస్. రెడ్డి సాహెబ్ పుట్టినరోజు వేడుకలను నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. రెడ్డి సాహెబ్‌కు దుశ్శాలువ కప్పి ఘనంగా సన్మానించిన నాయకులు, కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, పార్టీనే తన ఊపిరిగా భావించి సంస్థ బలోపేతానికి ఎస్. రెడ్డి సాహెబ్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తూ అధిష్టానం వద్ద తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని ప్రశంసించారు. పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎస్. రెడ్డి సాహెబ్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎస్. రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే కాంగ్రెస్ పార్టీపై తనకు అపారమైన అభిమానం ఉందని, అదే తనను పార్టీకి మరింత చేరువ చేసిందన్నారు. దేశ ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడి పనిచేసి 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకోవడంతో పాటు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.
అలాగే తన పుట్టినరోజు వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే ప్రేమాభిమానాలు భవిష్యత్తులో కూడా కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు మీనా కుమారి, అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శరత్ కుమార్ రెడ్డి, ఈశరయ్య, మహబూబ్ పీర్, నాగరాజు, ఖాసీం వలి, ఈశ్వరమ్మ, అల్లాభక్షు, హబీబ్, జీవన్ కుమార్, అసీప్, మౌళాలి, బావజాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.




