Madanapalle: కాంట్రాక్ట్ ఆరోగ్య సిబ్బంది నిరసన, ఆందోళన

Madanapalle: మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సోమవారం ఆందోళన చేపట్టారు.

Srinivasulu, Madanapalle
Published on: 31 Aug 2026 11:45 PM IST
Madanapalle
X

Madanapalle: కాంట్రాక్ట్ ఆరోగ్య సిబ్బంది నిరసన, ఆందోళన

మదనపల్లె: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని, ఉద్యోగి మృతి చెందిన సందర్భంలో రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఉద్యోగులకు ఈపీఎఫ్ సౌకర్యం, వేతనంతో కూడిన వైద్య సెలవులు, ఈహెచ్‌ఎస్ ఆరోగ్య కార్డులు అందించాలని కోరారు.

ఉద్యోగుల అభ్యర్థన మేరకు బదిలీలు, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. “మేము సేవ చేస్తున్నాం.. మా హక్కులను కల్పించాలి” అంటూ నినాదాలు చేశారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story