Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికలు పారదర్శకం దేవా రమేష్ ఘాటు విమర్శలు
Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయన్న రాజంపేట పార్లమెంట్ టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు దేవా రమేష్. వైసీపీ నేతల ఆరోపణలు సిగ్గుచేటని మండిపాటు.
Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికలు పారదర్శకం దేవా రమేష్ ఘాటు విమర్శలు
మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికలను ఎమ్మెల్యే షాజహాన్ భాష, మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ కుమార్ (చినబాబు) పారదర్శకంగా నిర్వహించారని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు దేవా రమేష్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై కొందరు వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటుగా ఉన్నాయని ఆయన విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగాయి కాబట్టే వైసీపీకి 12 సీట్లు వచ్చాయని, దౌర్జన్యాలకు పాల్పడాలనుకుంటే ఆ సీట్లు కూడా వచ్చేవి కావని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని దేవా రమేష్ పేర్కొన్నారు.




