Madanapalle: మదనపల్లె: సంతాన లక్ష్మిగా వాసవి మాత దర్శనం
Madanapalle: మదనపల్లెలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 8వ రోజు నవరాత్రుల్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Madanapalle: మదనపల్లె: సంతాన లక్ష్మిగా వాసవి మాత దర్శనం
మదనపల్లె: మదనపల్లె పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహించారు.
సంతాన లక్ష్మి అమ్మవారు సంతాన సౌభాగ్యం, కుటుంబ సుఖసంతోషాలు, శ్రేయస్సుకు ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. అమ్మవారి కరుణతో కుటుంబాల్లో ఆనందం, ఐక్యత, సుఖశాంతులు వెల్లివిరియాలని భక్తులు ప్రార్థిస్తారు.
ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ వివిధ అలంకరణల్లో అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బింగి పాండు గారు, ట్రెజరర్ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ యల్లంపల్లి ప్రశాంత్, లక్కీ టైల్స్ నగేష్, ఆనంద్, సంఘ సభ్యులు పాణి, శివ, చైతన్య, వినోద్, నందన్, శ్రీరాములు, సంతోష్, నాగరాజు గుప్తా తదితరులు పాల్గొన్నారు.




