Madanapalle: గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ ప్రమాణ స్వీకారం
Madanapalle: మదనపల్లె కనుములోని శ్రీ గంగమ్మ ఆలయ నూతన చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ ప్రమాణ స్వీకారం. హాజరైన కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు.
Madanapalle: గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ ప్రమాణ స్వీకారం
మదనపల్లె: కనుములోని శ్రీ గంగమ్మ ఆలయ నూతన చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ ప్రమాణ స్వీకారం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆలయ భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, టీడీపీ సీనియర్ నాయకులు బాబు రెడ్డి, జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరితో కలిసి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పాల్గొన్నారు.
అలాగే మార్కెట్ యార్డు చైర్మన్ జంగాల శివరాం రాయల్, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గంగమ్మ ఆలయ చైర్మన్‌గా గుట్ట వెంకటరమణ బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు.
ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. అందరి సహకారంతో ఆలయ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను మరింత పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నూతన చైర్మన్ గుట్ట వెంకటరమణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందరి సహకారంతో గంగమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అరుణ్ తేజ్, వాల్మీకి డైరెక్టర్ ప్రభాకర్, విశ్వబ్రాహ్మణ డైరెక్టర్ రామకృష్ణ ఆచారి, దొరస్వామి నాయుడు, యుగంధర్, పార్థ, విక్రమ్, కార్తీక్, ఆకుల రామ్మూర్తి, గుట్ట హరీష్, చిన్న రెడ్డప్ప, రవి, ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, పాల్గొన్నారు.




