Madanapalle: మదనపల్లెలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు!
Madanapalle: మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు. హాజరైన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ అల్లా బకష్, నాయకులు.
Madanapalle: మదనపల్లెలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు!
Madanapalle: మదనపల్లెలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు. నాడు దేశం కోసం మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తే.. నేడు కొందరు పదవులు, అధికారం కోసం అప్రకటిత ఎమర్జెన్సీ విధిస్తూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా సీనియర్ నాయకులు ఎస్. రెడ్డి సాహెబ్ విమర్శించారు.
మదనపల్లె దొంతివీధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్.రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ అల్లా బకష్ హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అల్లా బకష్, ఎస్. రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ దేశానికి ఉక్కు మహిళ అని, తన సమర్థవంతమైన నాయకత్వంతో ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవం వంటి కార్యక్రమాలతో రైతులు, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని గుర్తుచేశారు. ఆమె దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమృతేజ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శరత్ కుమార్ రెడ్డి, ఎన్ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్, మహమ్మద్ షరీఫ్, హైదర్ ఇల్లాహి, మీనా కుమారి, ముబారక్ ఖాన్, మహబూబ్ పీర్, ఈశ్వరయ్య, సోమశేఖర్, రవీంద్ర, ఈశ్వరమ్మ, కాసిం వల్లి, నాగరాజ, గంగులప్ప, వెంకటరమణ, అస్లాం భాష, సాదిక్ భాష, ఖాజావలి, హరి తదితరులు పాల్గొన్నారు.




