Madanapalle: మదనపల్లె గవిగుండు శివాలయంలో స్వచ్ఛందంగా క్లీన్ అండ్ గ్రీన్

Madanapalle: మదనపల్లె గవిగుండు శివాలయంలో ఐటీబీపీ సిబ్బంది, హరి డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణపై అవగాహన.

Srinivasulu, Madanapalle
Published on: 19 July 2026 2:38 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె గవిగుండు శివాలయంలో స్వచ్ఛందంగా క్లీన్ అండ్ గ్రీన్

మదనపల్లె: మదనపల్లె సమీపంలోని గవిగుండు శివాలయం పరిసరాల్లో ఆదివారం ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) హెచ్‌సీ సిరిగల రెడ్డెప్ప ఆధ్వర్యంలో, సీటీఎంకు చెందిన హరి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు, క్రాస్ రోడ్ పంచాయతీ ఇందిరమ్మ కాలనీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, ముళ్లు, పొదలు, ఇతర వ్యర్థాలను తొలగించారు. భక్తులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌సీ సిరిగల రెడ్డెప్ప మాట్లాడుతూ, పరిశుభ్రమైన పరిసరాలు ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హరి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు, ఇందిరమ్మ కాలనీకి చెందిన మంజుల, భవాని, రెడ్డెమ్మ, అంజమ్మ, కిరణ్ కుమారి, సోమశేఖర్, హనుమంత్ రెడ్డి, శ్రీనివాసులు, సతీష్, రమేష్ చిట్టీ, మల్లెల వాసు, విఘ్నేష్, రామచంద్రతో పాటు మహిళలు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా సేవలందించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story