Madanapalle: కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఐటియుసి మద్దతు
Madanapalle: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ జీతం పునరుద్ధరణ కోరుతూ మదనపల్లెలో వైద్య ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు.
Madanapalle: కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఐటియుసి మద్దతు
మదనపల్లె: కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, 100 శాతం గ్రాస్ జీతాన్ని పునరుద్ధరించాలని ఐటియుసి మదనపల్లె డివిజన్ కన్వీనర్ జి. కృష్ణమూర్తి డిమాండ్ చేశారు.
శనివారం మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, 95 రోజులుగా నిరసన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, డీఏ, హెచ్‌ఆర్‌ఏతో కూడిన వంద శాతం గ్రాస్ జీతాన్ని పునరుద్ధరించాలని, పారామెడికల్ పోస్టులకు రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని కోరారు.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణ ప్రధాన వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.




