Madanapalle: మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చిన్నబాబుకు జనసేన నేతల అభినందనలు

Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చిన్నబాబును శాలువాతో సత్కరించిన జనసేన రాష్ట్ర నేత అడపా సురేంద్ర. కూటమి సమన్వయంతో పట్టణాభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి.

Srinivasulu, Madanapalle
Published on: 9 Nov 2026 5:35 PM IST
Madanapalle
X

Madanapalle: మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చిన్నబాబుకు జనసేన నేతల అభినందనలు

మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబును జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చిన్నబాబును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అడపా సురేంద్ర మాట్లాడుతూ... శ్రీరామ్ చిన్నబాబు నాయకత్వంలో మదనపల్లె పట్టణం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

కూటమి పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి వరికోళ్ల నాగరాజు, మేకలచెరువు అర్జున్, సంజీవ్, అజయ్, నరేంద్ర, లక్ష్మీనారాయణ, అభి తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle