Madanapalle: కోళ్లబైలు వైఎస్సార్ కాలనీ సర్పంచ్ బరిలో చిన్నకోట్ల జయరాం!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె కోళ్లబైలు గ్రామ పంచాయతీ పరిధిలోని వైఎస్సార్ కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా చిన్నకోట్ల జయరాం పోటీకి సిద్ధమయ్యారు. అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
Madanapalle: కోళ్లబైలు వైఎస్సార్ కాలనీ సర్పంచ్ బరిలో చిన్నకోట్ల జయరాం!
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె కోళ్లబైలు గ్రామ పంచాయతీ పరిధిలోని వైఎస్సార్ కాలనీ సర్పంచ్ అభ్యర్థిగా చిన్నకోట్ల జయరాం పోటీకి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే షాజహాన్ భాష, కోళ్లబైలు ఇన్‌చార్జి రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆశీర్వాదంతో సర్పంచ్ బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నకోట్ల జయరాం మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆశీస్సులు, మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందితే వైఎస్సార్ కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.
కాలనీలో నెలకొన్న సమస్యలను గుర్తించి, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఒక అవకాశం ఇచ్చి ఆదరించాలని కాలనీ ప్రజలను కోరారు.




