Madanapalle: తప్పుడు రికార్డులతో భూమి ఆక్రమణ మదనపల్లెలో బాధితుల ఆవేదన!
Madanapalle: మదనపల్లెలో తప్పుడు రికార్డులతో భూమి ఆక్రమించారని బాధితుల ఆరోపణ. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి.
Madanapalle: తప్పుడు రికార్డులతో భూమి ఆక్రమణ మదనపల్లెలో బాధితుల ఆవేదన!
Madanapalle: కమ్మపల్లికి చెందిన తమ భూమిని సొంత అన్న ఆర్. తులసి నాయుడు తప్పుడు రికార్డులు సృష్టించి ఆక్రమించుకున్నారని ఆర్. దేవేంద్ర కుమార్, ఆర్. చంద్రశేఖర్, లేట్ రుసేంద్రనాయుడు కుమారుడు శశికుమార్ ఆరోపించారు. తమను ఇబ్బందులకు గురిచేస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని వారు మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు కమ్మపల్లిలోని సర్వే నంబర్ 163/1లో 1.08 ఎకరాల భూమిపై 2002లో న్యాయస్థానం తమకు హక్కులు కల్పించిందన్నారు.
అయినప్పటికీ తప్పుడు రికార్డులు సృష్టించి, రాజకీయ అండదండలతో తమ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులు, ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని వారు విలేకరుల ద్వారా కోరారు.




