Madanapalle: మదనపల్లెలో భూ వివాదం ఇరువర్గాల ఘర్షణలో ముగ్గురికి గాయాలు!

Madanapalle: మదనపల్లె సమీపంలోని కాట్లాటపల్లిలో భూ వివాదంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ. కత్తి దాడిలో ఒకరి వేలు తెగిపడగా, ముగ్గురికి తీవ్ర గాయాలు.

Srinivasulu, Madanapalle
Published on: 11 Sept 2026 9:29 AM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో భూ వివాదం ఇరువర్గాల ఘర్షణలో ముగ్గురికి గాయాలు!

Madanapalle: మదనపల్లె మండలం కాట్లాటపల్లి గ్రామ సమీపంలో గురువారం భూమి వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

బాధితుల కథనం ప్రకారం, రెడ్డీస్ కాలనీకి చెందిన వెంకట్రామిరెడ్డి భార్య ప్రభావతి, శివనగర్ ప్రాంతానికి చెందిన కృష్ణారెడ్డి భార్య రాజేశ్వరిపై ప్రత్యర్థి వర్గం దాడి చేసి వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారని ఆరోపించారు. ఇదే ఘర్షణలో విశ్వనాథరెడ్డి అనే వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో అతని కుడిచేతి వేలు తెగిపోయి తీవ్ర రక్తస్రావంతో గాయపడ్డాడు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తమ తల్లి గంగులమ్మ పేరిట కాట్లాటపల్లిలో 1.75 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఆ భూమిని విశ్వనాథరెడ్డి వర్గీయులు ఆక్రమించు కునేందుకు యత్నించారని, అడ్డుకోవడంతోనే తమపై దాడికి పాల్పడ్డారని ప్రభావతి, రాజేశ్వరి ఆరోపించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉంది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story