Madanapalle: మదనపల్లెలో మల్లికార్జున్ న్యూరో హాస్పిటల్ ప్రారంభం

Madanapalle: మదనపల్లెలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికార్జున్ న్యూరో అండ్ స్పైన్ కేర్ హాస్పిటల్‌ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ప్రముఖులు కలిసి ఘనంగా ప్రారంభించారు.

Srinivasulu, Madanapalle
Published on: 12 Oct 2026 3:37 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో మల్లికార్జున్ న్యూరో హాస్పిటల్ ప్రారంభం

మదనపల్లె: పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మల్లికార్జున్ న్యూరో అండ్ స్పైన్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అనూష, డాక్టర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కేరళ అడిషనల్ ఏడీజీపీ లక్ష్మణ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిన్నబాబు శ్రీరామ్, ఆర్టీసీ డీఎం లక్ష్మీనారాయణ హాజరయ్యారు.

వారు రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్య పరికరాలు, న్యూరో అండ్ స్పైన్ విభాగాల్లోని సదుపాయాలను పరిశీలించారు.

మదనపల్లెతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నరాలు, వెన్నెముక సంబంధిత ప్రత్యేక వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం అభినందనీయమని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. డాక్టర్ అనూష, డాక్టర్ మల్లికార్జున్‌లకు అభినందనలు తెలియజేస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle