Madanapalle: మదనపల్లెలో వర్షాల కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
Madanapalle: వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్ నిర్వహించారు.
Madanapalle: మదనపల్లెలో వర్షాల కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
Madanapalle: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు, పశుపక్షాదులు నీటి సమస్యల నుంచి బయటపడాలని ఆకాంక్షిస్తూ మదనపల్లెలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
మదనపల్లె పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆధ్వర్యంలో, మత పెద్దల సమక్షంలో ఆదివారం ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్ (సలాతుల్ ఇస్తిస్కా) నిర్వహించి అల్లాహ్‌ను ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని, రైతుల పంటలు బాగా పండాలని, తాగునీటి సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పట్టణానికి చెందిన ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. కార్యక్రమంలో మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




