Madanapalle: ఉత్సాహంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా డోర్ టూ డోర్ కార్యక్రమం!

Madanapalle: మదనపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో డోర్ టూ డోర్ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది.

Srinivasulu, Madanapalle
Published on: 1 Aug 2026 9:32 AM IST
Madanapalle
X

Madanapalle: ఉత్సాహంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా డోర్ టూ డోర్ కార్యక్రమం!

Madanapalle: మదనపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ ఎం. షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డోర్ టు డోర్ కార్యక్రమం రోజురోజుకూ మరింత ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కురుబ–కురమ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు.

ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రజల నుంచి వస్తున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story