Madanapalle: అమెరికాలో ఎన్నారైగా ఉన్నా మూలాలను మరవని పవన్ కుమార్

Madanapalle: అమెరికాలో ఉన్నత స్థాయిలో ఉన్నా మూలాలను మరచిపోని మదనపల్లె యువకుడు కందల పవన్ కుమార్. తల్లిదండ్రుల పట్ల బాధ్యతతో నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న వైనం.

Srinivasulu, Madanapalle
Published on: 16 Aug 2026 8:10 AM IST
Madanapalle
X

Madanapalle: అమెరికాలో ఎన్నారైగా ఉన్నా మూలాలను మరవని పవన్ కుమార్

Madanapalle: తల్లిదండ్రులు పడిన కష్టాలను గుర్తుంచుకుని, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తమ మూలాలను మరచిపోకూడదనే సందేశాన్ని కందల పవన్ కుమార్ ఆచరణలో చూపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సొసైటీ కాలనీ రామాలయం సమీపానికి చెందిన రామస్వామి, మధుసూదనమ్మ దంపతుల కుమారుడు కందల పవన్ కుమార్ ప్రస్తుతం అమెరికాలో ఎన్నారైగా స్థిరపడ్డారు.

చిన్ననాటి నుంచే తల్లిదండ్రుల కష్టాలను అర్థం చేసుకున్న పవన్ కుమార్ చదువుకుంటూనే సాయంత్రం వేళల్లో, సెలవు రోజుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడంతో ఉన్నత విద్యను అభ్యసించి అమెరికాలో మంచి స్థాయికి చేరుకున్నారు.

అయితే విదేశాల్లో స్థిరపడిన తర్వాత కూడా చిన్ననాటి రోజులను, తనను చదివించేందుకు తల్లిదండ్రులు పడిన కష్టాలను ఆయన ఏమాత్రం మరచిపోలేదు. స్వదేశానికి వచ్చిన ప్రతిసారీ తల్లిదండ్రులతో కలిసి ఉంటూ, వారికి అవసరమైన పనుల్లో స్వయంగా సహాయం చేస్తూ తన అనుబంధాన్ని చాటుకుంటున్నారు.

‘ఎంత ఎదిగినా తల్లిదండ్రుల కష్టాలను, మన మూలాలను మరచిపోకూడదు’ అనే విషయాన్ని పవన్ కుమార్ తన ఆచరణ ద్వారా నిరూపిస్తున్నారని స్థానికులు అభినందిస్తున్నారు. విదేశాల్లో ఉన్నత స్థాయికి ఎదిగినా తల్లిదండ్రుల పట్ల ప్రేమ, బాధ్యతను కొనసాగిస్తున్న పవన్ కుమార్ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు పేర్కొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story